అసెంబ్లీలో జనసేనాని అడుగుపెట్టేది ఖాయం!

అసెంబ్లీలో జనసేనాని అడుగుపెట్టేది ఖాయం!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ ఆరంగేట్రం ఖాయమని తేల్చి చెప్పారు ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్. అమరావతిలో లగడపాటి రాజగోపాల్ మీడియాతో మాట్లాడారు. జనసేనాని కచ్చితంగా శాసనసభలో అడుగు పెట్టనున్నారని స్పష్టం చేశారు. అయితే జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయనే విషయం మాత్రం ఆయన చెప్పలేదు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం కంటే తక్కువ రావచ్చని అభిప్రాయపడ్డారు. ఏపీ ఎన్నికల ఫలితాలపై మాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంపై రాష్ట్ర భవిష్యత్ ఆధారపడి ఉందన్నారు. అయితే ఇప్పుడు చెప్పినవన్నీ ఒక రాజకీయ నాయకుడిగా తన అంచనాలు మాత్రమేనని, రేపు సాయంత్రం 6 గంటలకు తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించి ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తానని లగడపాటి రాజ్ గోపాల్ తెలిపారు.