వామపక్ష నేతలతో సమావేశమైన పవన్

వామపక్ష నేతలతో సమావేశమైన పవన్

ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన నేపధ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పీడు పెంచారు. ఈ రోజు అమరావతిలో వామపక్ష నేతలతో పవన్ సమావేశమయ్యారు. సీపీఐ, సీపీఎం నేతలు రామకృష్ణ, మధులతో పవన్ సమావేశమై సుమారు గంటన్నర పాటు చర్చించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ఎన్నికల సీట్ల సర్దుబాటుపై తీవ్ర చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం లెఫ్ట్ పార్టీలకు సీట్ల కేటాయింపుపై పవన్ క్లారిటీ ఇవ్వనున్నారు. మరోవైపు తొలి జాబితా సిద్ధం చేసిన పవన్.. రేపు విడుదల చేసే అవకాశం ఉంది.