పవన్ రోడ్‌ షో సాగనుంది ఇలా..

పవన్ రోడ్‌ షో సాగనుంది ఇలా..

రాయలసీమ జిల్లాల పర్యటనలో భాగంగా చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్... ఇవాళ చిత్తూరులో రోడ్‌షో నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు చిత్తూరులోని కాఫీ డే దగ్గర మొదలుకానున్న జనసేనాని రోడ్‌షో.. ఇరువారం, కాజూరు, దర్గా, ఎం.ఎస్.ఆర్, ఓల్డ్ బస్ స్టాండ్ మీదుగా గాంధీ బొమ్మ సెంటర్ వరకు సాగనుంది. అనంతరం అక్కడ నిర్వహించనున్న బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారు. ఇక పవన్ కల్యాణ్ పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి జనసేన శ్రేణులు. కాగా, పవన్ రోడ్‌షో ఇవాళ ఉదయం 11.30 గంటలకు మదనపల్లె నుంచి ప్రారంభం కానుంది. పుంగనూరులో మధ్యాహ్నం రోడ్‌ షో నిర్వహించనున్న ఆయన... సాయంత్రం 4.30 గంటలకు పలమనేరులో రోడ్‌ షో నిర్వహించి అనంతరం చిత్తూరుకు చేరుకోనున్నారు పవన్ కల్యాణ్.