కాషాయ దుస్తులలో పవన్ కళ్యాణ్‌..

కాషాయ దుస్తులలో పవన్ కళ్యాణ్‌..

మొన్నటి వరకు  షూటింగ్‌లో ఫుల్‌ బిజీగా ఉన్న జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌.. ఒక్కసారిగా తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. గత మూడు రోజులు నుంచి తిరుపతిలో పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పవన్‌ కళ్యాణ్‌ పాల్గొన్నారు. ఇవాళ తిరుమల వెంకటేశ్వర స్వామిని జనసేనాని దర్శనం చేసుకున్నారు.  ఆలయ మర్యాదలతో ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని చాలా రోజులైందని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో శ్రీవారి దగ్గరికి రాలేకపోయానని.. ఇవాళ స్వామివారి ఆశీస్సులు లభించాయని తెలిపారు.  రాజకీయాలపై అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ... తిరుమలలో రాజకీయాలు మాట్లాడవద్దని... రాజీకీయాలపై తిరుపతి ప్రెస్‌మీట్‌లో మాట్లాడతానని స్పష్టం చేశారు పవన్‌ కళ్యాణ్‌. అయితే... పవన్‌ కళ్యాణ్‌ ఆలయ నుంచి బయటకు వస్తున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాషాయ దుస్తులలో పవన్‌ ని చూసిన ఫ్యాన్స్‌ ముగ్ధులవుతున్నారు.