మోడీ అంటే గౌరవం.. భయం కాదు

మోడీ అంటే గౌరవం.. భయం కాదు

ప్రధాని మోడీ అంటే గౌరవం ఉంది కానీ.. అది భయం కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆదివారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో రాయలసీమ జిల్లాల నేతలతో పవన్ కళ్యాణ్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్.. ప్రతి ఒక్కరూ మీరు ఎందుకు ఓడిపోయారని అంటున్నారని, తాను ఓడినా తనకు వచ్చిన ప్రతి ఓటు వంద కోట్లతో సమానం అని అన్నారు. జనసేన సీట్లు గెలవకపోయినా.. ప్రజల హృదయాలని గెలిచిందన్నారు. సమస్యల పరిష్కారం కోసమే జనసేన ఉందని ఉద్ఘాటించారు. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు జనసైనికులు సిద్ధం కావాలని పవన్ పిలుపునిచ్చారు.