ఉత్తరాంధ్ర జిల్లా నేతలతో పవన్ కల్యాణ్ భేటీ

ఉత్తరాంధ్ర జిల్లా నేతలతో పవన్ కల్యాణ్ భేటీ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఘోర పరాజయం తరువాత తొలిసారి అధినేత పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయం ఈ సమీక్షకు వేదికైంది. ఈ నేపథ్యంలో ఓటమికి గల కారణాలపై జిల్లాల వారీగా ఆయన సమీక్షను జరుపుతున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఉత్తరాంధ్ర జిల్లాల నేతలతో పవన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ ఓటమికి గల కారణాలు, సంస్థాగత ఎన్నికలపై ఆయన వారితో చర్చించారు.

సమీక్షల్లో భాగంగా పవన్ తొలిరోజు కృష్ణా, ప గో జిల్లాల నేతలతో సమీక్ష నిర్వహించారు. సమీక్షా సమావేశంలో పవన్‌‌తో పాటూ సోదరుడు, నర్సాపురం నుంచి పోటీ చేసి ఓడిన నాగబాబు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. గ్రామస్థాయి నుంచి బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు.. స్థానికసంస్థల ఎన్నికల వ్యూహాలపైనా చర్చించారు. 13 జిల్లాలో నేతలతో పార్టీ ఓటమి, స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై సమీక్ష నిర్వహించనున్నారు.