అసెంబ్లీ రద్దుపై చర్చించిన జనసేన

అసెంబ్లీ రద్దుపై చర్చించిన జనసేన

తెలంగాణలో అసెంబ్లీని రద్దు చేస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయం, ఆ తరువాత పరిణామాలపై మాదాపూర్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో విస్తృతమైన చర్చ జరిగింది. ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఆధ్వర్యంలో ఈ చర్చ జరిగింది. 

ఈ నిర్ణయంతో తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహం, రాజకీయ కూటములు, వాటి బలాబలాలపై కమిటీ బేరీజు వేసింది. భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై ఒక నివేదిక రూపొందించి పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు సమర్పించాలని నిర్ణయించింది. శని లేదా ఆదివారాల్లో పవన్ తో భేటీ ఉంటుందని, అందులో తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించి నిర్ణయం ఖరారు చేసే అవకాశం ఉందని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.