జనసేన తొలి జాబితా రెడీ..

జనసేన తొలి జాబితా రెడీ..

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో జనసేన పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను సిద్ధం చేసింది. అసెంబ్లీకి పోటీ చేసే 32 మంది అభ్యర్థులు, లోక్‌సభకు పోటీ చేసే 9 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేస్తామని పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ చెప్పారు. జనరల్‌ బాడీ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రేపు లేదా ఎల్లుండి ఈ జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది.