జనసేన తొలి జాబితా.. రేపు లేదా ఎల్లుండి?

జనసేన తొలి జాబితా.. రేపు లేదా ఎల్లుండి?

అత్యంత ఉత్కంఠ భరితంగా మారిన ఎన్నికల ప్రక్రియ మొదలైంది. లోక్ సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, ఆరుణాచల్ ప్రదేశే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ షెడ్యూల్‌ విడుదల చేసింది. మొత్తం 7 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా తొలి విడతలోనే ఏపీలోని 25 లోక్ సభ స్థానాలతోపాటు శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ఇంకా 31 రోజులే ఉన్నందు అన్ని పార్టీలూ అభ్యర్థుల ప్రకటనపై ఫోకస్‌ పెట్టాయి. 

ఇందులో భాగంగానే అభ్యర్థులపై ఇవాళ పార్టీ నేతలతో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ సమీక్ష నిర్వహించారు. రెండు రోజుల్లో తొలి జాబితా విడుదల చేసే దిశగా పవన్ సమాలోచనలు జరిపారు. రేపు లేదా ఎల్లుండి తొలి జాబితాను ఆయన ప్రకటించే అవకాశం ఉంది. స్క్రీనింగ్ కమిటీ ముందుకు వచ్చిన దరఖాస్తుల నుంచి తొలి జాబితాను పవన్‌ ప్రకటించబోతున్నారు.