జనసేన కవాతు వాయిదా?

జనసేన కవాతు వాయిదా?

నేడు గోదావరి జిల్లాల నేతలతో విజయవాడలో సమావేశంకానున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్... కొవ్వూరు-రాజమండ్రి వంతెనపై ఈ నెల 9న నిర్వహించాలని తలపెట్టిన కవాతు వాయిదా వేసే అవకాశం ఉందంటున్నారు జనసేన శ్రేణులు. కొవ్వూరు - రాజమండ్రి సామర్ధ్యం 25 వేలు మాత్రమే కాబట్టి... అంతకు మించి వస్తారనే అంచనాల నేపథ్యంలో మార్పు చేసే అవకాశం ఉంది. ధవళేశ్వరం బ్రిడ్జి మీద కవాతు నిర్వహించాలని నిపుణుల సూచన నేపథ్యంలో మార్పుపై సమావేశంలో పవన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. మరి కవాతు యథావిథిగా నిర్వహిస్తారా...? లేక వాయిదా వేస్తారా? అనేదానిపై ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న సమావేశంలో క్లారిటీ రానుంది.