16న జనసేన- లెఫ్ట్ పార్టీల తుది సమావేశం 

16న జనసేన- లెఫ్ట్ పార్టీల తుది సమావేశం 

విజయవాడలో ఈనెల 16న జనసేన- లెఫ్ట్ పార్టీల తుది సమావేశం జరగనుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పష్టం చేశారు. గురువారం అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 16న పోటీ చేసే సీట్లు, స్థానాలపై లెఫ్ట్ పార్టీల నేతలకు క్లారిటీ ఇవ్వాలని పవన్ నిర్ణయించారని తెలిపారు. అలాగే 16న జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో 13 జిల్లాల్లో ఏ నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేయాలనేది నిర్ణయిస్తామని అన్నారు. దేశంలో జరిగే ఎన్నికల్లో అతి ఖరీదైన రాష్ట్రంగా ఏపీని మార్చారని ఆరోపించారు. ఆ విషయంలో ధనిక దేశమైన అమెరికాను మించిపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎవరు ఏ పార్టీలో ఉంటారో అర్ధం కాని పరిస్థితి ఉందని అన్నారు. లోక్ సభలో ప్రతిపక్షంగా ఉన్న కాకినాడ ఎంపీ తోట నరసింహులు ఇప్పుడు వైసీపీలోకి వెళ్లారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సీపీఐ 13, సీపీఎం 13 స్ధానాల్లో పోటీ చేయనున్నట్లు రామకృష్ణ తెలిపారు.