జనసేన- లెఫ్ట్ పార్టీల పొత్తులపై భేటీ..

జనసేన- లెఫ్ట్ పార్టీల పొత్తులపై భేటీ..

జనసేన-లెఫ్ట్ పార్టీల మధ్య పొత్తు కసరత్తు ప్రారంభమైంది. విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో సీపీఎం తరపున మధు, సీపీఐ తరపున రామకృష్ణ, జనసేన తరపున నాదేండ్ల మనోహర్ చర్చలు జరిపారు. సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై సమాలోచనలు, రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చించారు. సమావేశం అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. పార్టీల పరంగా ఉన్న బలాబలాలు గురించి చర్చించినట్లు నాదేండ్ల మనోహర్ తెలిపారు. మరోసారి భేటీ కావాలని నిర్ణయించామని, మా మధ్య ఎటువంటి గ్యాప్ లేదని అన్నారు. మంచి వాతావరణలోనే చర్చలు జరిగాయని తెలిపారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అధ్యక్షతన మరో మారు మాట్లాడి సీట్లు సర్ధుబాటు చేస్తామని నాదేండ్ల పేర్కొన్నారు.