తిరుపతి ఉప ఎన్నికల బరిలో “జనసేన”..?

తిరుపతి ఉప ఎన్నికల బరిలో “జనసేన”..?

ఏపీ రాజకీయ పార్టీలు ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలపై దృష్టి పెట్టాయి. ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ రాకముందే... ప్రజలకు దగ్గర అవుతున్నాయి పార్టీలు. ఇందులో భాగంగానే ఇప్పటికే వైసీపీ, తెలుగుదేశం పార్టీలు అభ్యర్థులను ప్రకటించేశాయి. అటు బీజేపీ కూడా పోటీకి సిద్ధమని తెలిపింది. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితమే.. తిరుపతి ఉప ఎన్నికల్లో వస్తుందని బీజేపీ అగ్రనేతలే అంటున్నారు. హిందుత్వ వాదంతో ముందుకు వెళ్లనున్నట్టు బీజేపీ ప్లాన్‌ చేస్తుందని సమాచారం. అయితే.. తాజాగా  తిరుపతి ఉప ఎన్నికల బరిలో  “జనసేన” ఉంటుందని తెలుస్తోంది. ఈ మేరకు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ ఎత్తుగడలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో ఇవాళ బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ కలవనున్నారు.  GHMC ఎన్నికల్లో వెనక్కి తగ్గినందుకు తిరుపతి సీటు  జనసేన కోరుతున్నట్లు సమాచారం. ఆ విషయంపై బీజేపీ అగ్రనేతలు చర్చలు జరపనున్నారు పవన్ కళ్యాణ్. ఈ చర్చల్లో పవన్ కళ్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్ పాల్గొననున్నారు.  తిరుపతి లోకసభ  నియోజకవర్గం పరిధిలో ఓట్లు తమకు ఎక్కువగా ఉన్నాయని జనసేన లెక్కలు వేసుకున్నట్లు సమాచారం. అయితే.. ఈ ఉప ఎన్నిక బరిలో స్వయంగా పవన్‌ కళ్యాణ్‌ దిగనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.