జగన్‌తో జనసేన ఎమ్మెల్యే భేటీ..

జగన్‌తో జనసేన ఎమ్మెల్యే భేటీ..

జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు.. ఏపీ సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. ఇవాళ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జగన్‌ ఛాంబర్‌కు వరప్రసాద్ వెళ్లారు. కొద్దిసేపు ఆయనతో భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత బయటకు వచ్చిన వరప్రసాద్.. జగన్‌ను మర్యాదపూర్వకంగానే కలిశానని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాజోలు నుంచి ఎన్నికైన వరప్రసాద్‌.. జనసేన పార్టీని వీడేది లేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.