పవన్ మీద రాపాక సంచలనం..అన్నాతమ్ముళ్ళ మధ్య చిచ్చు !

పవన్ మీద రాపాక సంచలనం..అన్నాతమ్ముళ్ళ మధ్య చిచ్చు !

జనసేన పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఇప్పుడు ఆ పార్టీ వారికి నిద్ర లేకుండా చేస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని పై పవన్ నిర్ణయంతో తనకు సంబంధం లేదని పేర్కొన్న ఆయన పవన్ ఇంట్లోనే రెండు అభిప్రాయాలు ఉన్నప్పుడు పార్టీలో రెండు అభిప్రాయాలు ఉండటం తప్పేంటని ప్రశ్నించారు. పార్టీ అధినేతగా నిర్ణయం ఆయనదేనని తనకు పార్టీ కన్నా ఓట్లేసిన ప్రజలే తనకు ముఖ్యమని ఆయన అన్నారు. పవన్ అన్న చిరంజీవి కూడా మూడు రాజధానులను సమర్థించారని పవన్ కూడా మూడు రాజధానుల్ని వ్యతిరేకించడం లేదన్నారు. ఎక్కడ పెడతారో స్పష్టం చేయమని అడుగుతున్నారే తప్ప ఫలానా చోట వద్దని అనడం లేదని అన్నారు. అమరావతి భూములు లాక్కున్నప్పుడు పవన్ ఆందోళన చేశారని గుర్తు చేశారు. దీంతో ఈయన ఏకంగా అన్నా తమ్ముళ్ళ మీదే చిచ్చు పెట్టాడని అంటూ కామెంట్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు.