జనసేన ఎమ్మెల్యేపై శ్రీకాంత్‌రెడ్డి ఫైర్.. జాలి చూపమన్న రాపాక!

జనసేన ఎమ్మెల్యేపై శ్రీకాంత్‌రెడ్డి ఫైర్.. జాలి చూపమన్న రాపాక!

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.. ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. వైసీపీ, బీజేపీ మిత్రపక్షాలంటూ రాపాక చేసిన వ్యాఖ్యాలపై సీరియస్‌గా స్పందించిన శ్రీకాంత్ రెడ్డి... వరప్రసాద్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తాము బీజేపీతో కలిసి పోటీ చేయలేదని.. పొత్తు పెట్టుకోలేదని స్పష్టం చేశారు. జనసేన ఎమ్మెల్యే ఏదిపడితే అది మాట్లాడితే కుదరదని శ్రీకాంత్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. టీడీపీతో జనసేన అంతర్గత పొత్తు విషయం అందరికీ తెలుసని విమర్శించారు. కేంద్రంతో పొట్లాడే పరిస్థితి లేదని, సఖ్యతగా ఉంటూ హోదా సాధనకు కృషి చేస్తున్నామని... ఏ సమావేశమైనా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం జగన్ చెబుతూ వస్తున్నారని స్పష్టం చేశారు శ్రీకాంత్‌రెడ్డి. ఇక శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన రాపాక వరప్రసాద్... శ్రీకాంత్‌రెడ్డి గారు అన్ని బాణాలు నాపై ఎక్కుపెట్టాల్సిన అవసరం లేదు... తాను ఒక్కడినే ఉన్నానని ఫన్నీ కామెంట్స్ చేసిన రాపాక... వైసీపీ, బీజేపీ మిత్రపక్షాలని వ్యాఖ్యానించడం నా తప్పే.. అయితే, కేంద్రంతో సఖ్యతతో ఉంటూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలని సూచించారు జనసేన ఎమ్మెల్యే. ఇక ప్రభుత్వం మంచి పథకాలను తీసుకొస్తుందని... వాటిని సవ్యంగా అమలు చేస్తే ప్రజలకు మంచి జరుగుతోందని వ్యాఖ్యానించారు.