సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ను ముట్టడించిన జనసేన..

సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ను ముట్టడించిన జనసేన..

తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలలో అవకతవకలు జరిగాయంటూ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ హైదరాబాద్‌లోని సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించడానికి యత్నించారు జనసేన కార్యకర్తలు... ఇంటర్‌బోర్డులో జరుగుతోన్న అవకతవకలపై న్యాయ విచారణ చేసి, నష్టపోయిన విద్యార్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జనసేన కార్యకర్తలు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. క్యాంప్ ఆఫీస్ ముట్టడికి వచ్చిన జనసేన కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు.. గోషామహాల్ స్టేడియానికి తరలించారు.