అప్పుడే జనసేన అభ్యర్థుల ప్రకటన..!

అప్పుడే జనసేన అభ్యర్థుల ప్రకటన..!

ఎన్నికలకు అన్ని వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్... ఇందులో భాగంగా ఈ నెల 14వ తేదీన రాజమండ్రిలో నిర్వహించే జనసేన పార్టీ ఆవిర్భావ సభలో మేనిఫెస్టోను ప్రకటించనున్నారు జనసేనాని...ఇక ఎన్నికల షెడ్యూల్ విడుదల బట్టి లెఫ్ట్ పార్టీలతో సీట్ల సర్దుబాటును ఫైనల్ చేయడం పవన్ కల్యాణ్ ప్లాన్‌గా కనిపిస్తుండగా... ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు తమ పార్టీల అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఎన్నికల బరిలో దిగనున్న జనసేన అభ్యర్థుల లిస్ట్ ప్రకటించాలని పవన్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.