అందుకే రైలు ప్రయాణం-పవన్

అందుకే రైలు ప్రయాణం-పవన్

ప్రజా సమస్యలను తెలుసుకోవటం కోసమే రైలు ప్రయాణం చేస్తున్నానని తెలిపారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్... సామాన్యుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే ప్రయత్నమే ఇది అన్నారు... జనసేనాని రైలు టూర్ కొనసాగుతోంది... నూజివీడులో రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు పవన్ కల్యాణ్... రైతులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చెరకు రైతులు, చేనేత కార్మికులు, విద్యార్థులతో పాటు ఏటికొప్పాక బొమ్మల తయారీ కార్మికులతో భేటీ కానున్నారు పవన్ కల్యాణ్. అంతకు ముందు విజయవాడలో జన్మభూమి రైలు ఎక్కిన పవన్... రైల్లో రైల్వే పోర్టళ్లతో బేటీ అయ్యారు. మామిడి రైతులను, అసంఘటిత రంగ కార్మికులను కూడా కలిశారు. చంద్రబాబు ఢిల్లీ టూర్‌పై సెటైర్లు వేసిన పవన్... పదవి కాపాడుకోవడానికి చంద్రబాబు ఢిల్లీ బాట పట్టారని సెటైర్లు వేశారు. బలమైన పోరాటం హోదా కోసం చేయాలని సూచించిన జనసేన అధినేత ప్రజా సమస్యల పరిష్కారం వల్లే సమీకరణాలు మారతాయి తప్ప పార్టీల కలయికల వల్ల కాదన్నారు. కాంగ్రెస్ గురించి చెప్పే చంద్రబాబు ఈ నిర్ణయం 2014లోనే తీసుకోవాల్సిందన్నారు.