వచ్చే ఎన్నికల్లో పవన్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారో తెలుసా?

వచ్చే ఎన్నికల్లో పవన్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారో తెలుసా?

2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అన్ని నియోజ వర్గాల నుంచి పోటీ చేసినా కేవలం ఒక్క ప్లేస్ లో మాత్రమే విజయం సాధించింది.  అది కూడా రాజోలు ప్రాంతం నుంచి.  అయితే, పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక నియోజక వర్గాల నుంచి పోటీ చేశారు.  ఒక్క ప్రాంతం నుంచి పోటీ చేసి ఉంటె పవన్ గెలిచేవారని అంటున్నారు.  ఎందుకంటే, ఒక్క ప్రాంతంపై ఎక్కువగా దృష్టి పెట్టి ఉంటె బాగుండేది. 

రెండు చోట్ల నుంచి పోటీ చేయడం వలన రెండు ప్రాంతాల వాసులు ఓటు వేయలేదు.  కారణం ఏంటో అందరికి తెలిసిందే.  అయితే, వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక ప్రాంతాల నుంచి కాకుండా మరో కొత్త ప్రాంతం నుంచి పోటీ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి.  గత ఎన్నికల్లోనే ఆ నియోజక వర్గం నుంచి పోటీ చేయాల్సి ఉన్నది.  అక్కడి నుంచి పోటీ చేసి ఉంటె తప్పకుండా పవన్ గెలిచేవారట.  కానీ, నేతలు సూచనల మేరకు ఆ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేశారట.  అయితే, వచ్చే ఎన్నికల్లో పవన్ తాడేపల్లి గూడెం నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.  ఇకపై ఈ నియోజక వర్గం మీదనే ఎక్కువగా దృష్టి పెట్టబోతున్నారు.  తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేస్తే తప్పకుండా గెలిచే అవకాశం ఉన్నట్టుగా సర్వ్ ద్వారా తెలియడంతో పవన్ ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు.