రేపు నంద్యాలకు పవన్ కల్యాణ్..

రేపు నంద్యాలకు పవన్ కల్యాణ్..

జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్‌ రేపు కర్నూలు జిల్లా నంద్యాలకు వెళ్లనున్నారు. ఇటీవలే కన్నుమూసిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు జనసేనాని.. అనంతరం ఎస్పీవై రెడ్డి సమాధి దగ్గర నివాళులర్పించనున్నారు. కాగా, టీడీపీ నుంచి మరోసారి నంద్యాల లోక్‌సభ స్థానం టికెట్ ఆశించి భంగపడిన ఎస్పీవై రెడ్డి... సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున బరిలోకి దిగారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడిన ఆయన.. ఎన్నికల ప్రచార సమయంలో అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్‌కు తరలించి... బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. చివరకు చికిత్స పొందుతూ ఆయన కన్నుమూసిన సంగతి తెలిసిందే.