ఏ క్షణంలోనైనా జనసేన ఎమ్మెల్యే అరెస్ట్..!?

ఏ క్షణంలోనైనా జనసేన ఎమ్మెల్యే అరెస్ట్..!?

సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి విజయం సాధించిన  ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యే రాపాక‌పై మలికిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్టు సమాచారం. ఓ కేసు విషయంలో మలికిపురం ఎస్సై కేవీ రామారావుకు ఎమ్మెల్యే రాపాకకు మధ్య వివాదం మొదలు కాగా.. ఎమ్మెల్యేకు మద్దతుగా జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇదే సమయంలో జనసేన కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌పై దాడి చేయగా.. దీనిని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారని చెబుతున్నారు. మరోవైపు మలికిపురం మండలంలో పోలీసులను భారీగా మోహరిస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌పై దాడి ఘటనలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తారని ప్రచారం సాగుతోంది.