పీఎస్‌లో లొంగిపోయిన జనసేన ఎమ్మెల్యే

పీఎస్‌లో లొంగిపోయిన జనసేన ఎమ్మెల్యే

ఓవైపు భారీగా పోలీసుల మోహరింపుతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు పీఎస్‌కు వెళ్లిన ఆయన.. ఏలూరు రేంజ్ డీఐజీ ఖాన్ సమక్షంలో లొంగిపోయారు. కాగా, ఓ కేసు విషయంలో మలికిపురం ఎస్సై కేవీ రామారావుకు ఎమ్మెల్యే రాపాకకు మధ్య వివాదం మొదలు కాగా.. ఎమ్మెల్యేకు మద్దతుగా జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. రాపాక అనుచరులు పోలీస్ స్టేషన్ ను ధ్వంసం చేయడాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. రాపాక వరప్రసాద్ పై కేసు బుక్‌ చేశారు... పీఎస్‌పై దాడి కేసులో ఎమ్మెల్యే రాపాకను ఏ-1గా చేర్చారు పోలీసులు. దీంతో ఏ క్షణంలోనైనా ఆయనను అరెస్ట్ చేస్తారనే ప్రచారం కూడా సాగింది.. ముందస్తు చర్యగా పోలీసులను కూడా మోహరించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాదే పీఎస్‌కు వెళ్లి లొంగిపోయారు.