దేవ్... సారీ, వాసుదేవయ్య అనే నేను...

దేవ్... సారీ, వాసుదేవయ్య అనే నేను...

దేవ్... ఈపేరు గుర్తుందిగా... ఈయనే జనసేన పార్టీ చీఫ్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్... ఈ మధ్యే దేవ్‌ను జనసేన అధినేత పవన్ కల్యాణ్... పార్టీ చీఫ్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా ప్రకటించారు. ఇక దేవ్‌కు సహాయంగా 1200 మంది సీపీఎఫ్ సంస్థ కార్యకర్తలు కూడా పనిచేస్తున్నారు. పవన్ ఈ పేరు ప్రకటించగానే దేవ్ ఎవరనే చర్చ మొదలైంది. అందరూ ఆయన మూలాలను వెతకడం మొదలు పెట్టారు. దేవ్... సారీ, వాసుదేవయ్య అలియాస్ దేవ్ వాసుదేవ్‌ కేరాఫ్ చింతల్ బస్తి... విద్యాసంస్థలు నడిపే వ్యాపారవేత్తగా ఆయనకు పేరుంది... ఓ వృద్ధాశ్రమాన్ని కూడా నడుపుతున్నట్టు సమాచారం. అయితే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సర్వే లు చేస్తానని... పాపులర్ శాఫాలజిస్ట్ అన్నది బయట టాక్.

ఇక వాసుదేవయ్య మూలాలు భారతీయ జనతా పార్టీలో ఉన్నాయి... 2014లో కిష‌న్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ చేరిన దేవ్... అప్పట్లో బీజేపీ నుంచి సనత్‌నగర్ అసెంబ్లీ స్థానానికి బరిలో దిగాలనే విశ్వప్రయత్నాలు చేశారట. అయితే పొత్తుల్లో భాగంగా ఆ స్థానం కాస్త ప్రస్తుత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు కేటాయించారు. ఆ సీటు దక్కకపోవడంతో మ‌ళ్లీ ఆయన వ్యాపారాలపై దృష్టిసారించారు. అయితే ఇప్పుడు సడన్‌గా జనసేన శిబిరంలో ప్రత్యక్షం కావడం చర్చనీయాంశంగా మారింది. దేవ్... జనసేన పార్టీలో చేరడం వెనుక భారతీయ జనతా పార్టీ పెద్దలు ఉన్నారనే టాక్ విస్తృతంగా సాగుతోంది. ఇప్పటికే బీజేపీ నుంచి అద్దేప‌ల్లి శ్రీధర్... జనసేనలో క్రియాశీలకంగా పనిచేస్తుండగా... ఇప్పుడు దేవ్‌కు కీలక బాధ్యతలు అప్పజెప్పడం చర్చగా మారింది. ఇక దేవ్ జనసేన పొలిటికల్ స్ట్రాటజిస్టా...? లేక బీజేపీ పొలిటికల్ స్ట్రాటజిస్టా? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.