3 లేదా 4వ తేదీన విశాఖలో జనసేన ర్యాలీ..

3 లేదా 4వ తేదీన విశాఖలో జనసేన ర్యాలీ..

భవన నిర్మాణ కార్మికులకు మద్దతు తెలుపుతోంది జనసేన పార్టీ.. వారికి మద్దతుగా ఆందోళనకు సిద్ధమవుతోంది.. ఇవాళ హైదరాబాద్‌లో జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది.. ఈ సమావేశంలో నవంబర్ 3వ తేదీన లేదా 4వ తేదీన విశాఖలో ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించింది. భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా ఈ ర్యాలీ చేపట్టనున్నట్టు వెల్లడించారు నేతలు. ఇక, ఈ ర్యాలీ ఏర్పాట్లకు సంబంధించి... తోట చంద్రశేఖర్ నేతృత్వంలో సబ్‌ కమిటీని వేసింది జనసేన పార్టీ.. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. భవన నిర్మాణ కార్మికులకు తాము అండగా నిలుస్తామని వెల్లడించారు.