పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు నెగిటివ్

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు నెగిటివ్

జనసేన అధినేత, సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. పవన్ కోవిడ్ బారినపడ్డారనే వార్త తెలియగానే ఫ్యాన్స్, సినీ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున పోస్టులు చేశారు. అయితే తాజాగా నిర్వహించిన పరీక్షల్లో పవన్ కళ్యాణ్‌కు నెగిటివ్‌గా నిర్దారణ అయింది. హైదరాబాద్‌లోని ట్రినిటీ ఆసుపత్రిలో పవన్ కోవిడ్ పరీక్ష చేయించుకున్నారు. పవన్‌కు కరోనా లక్షణాలు చాలా స్వల్పంగానే ఉండటంతో... ఆయన త్వరగానే కోలుకున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు జనసేన వర్గాలు గాని, ఆసుపత్రి వైద్యులు గాని అధికారికంగా వెల్లడించలేదు.