తెలంగాణ యురేనియం కాలుష్యంపై పవన్ ట్వీట్.. వైరల్..!!

తెలంగాణ యురేనియం కాలుష్యంపై పవన్ ట్వీట్.. వైరల్..!!

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ చేపట్టిన నల్లమలలో యురేనియం తవ్వకాలపై దృష్టి పెట్టారు.  యురేనియం తవ్వకాల కారణంగా భవిష్యత్ తరాలు ఇబ్బందుల్లో పడతారని, పిల్లలు యురేనియం ఎఫెక్ట్ కారణంగా జన్యులోపాలు వస్తాయని పవన్ గతంలో పేర్కొన సంగతి తెలిసిందే.  దీనిపై ఈరోజు జనసేన అధ్యక్షుడు పవన్ ట్వీట్ చేశారు.. 

"భావి తరాలకి, బంగారు తెలంగాణ ఇస్తామా? యురేనియం కాలుష్యం తెలంగాణ ఇస్తామా? అన్నది అన్ని ప్రజా సంఘాలు , రాజకీయ పక్షాలు ఆలోచించాలి?" అంటూ పవన్ ట్వీట్ చేశారు.  ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.. నల్లమలలో తెలంగాణ ప్రభుత్వం తవ్వకాలు జరుపుతామని చెప్పిన తరువాత కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడానికి సిద్ధం అయ్యింది. ఇదే విషయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ జనసేన పార్టీ కార్యాలయంలో కలిసిన సంగతి తెలిసిందే.  తాము చేపట్టిన పోరాటానికి పవన్ కూడా మద్దతు తెలిపితే మరింత సమర్థవంతంగా పోరాటం చేస్తామని అన్నారు.  అటు రేవంత్ రెడ్డి కూడా నల్లమలలో కలిసి పోరాటం చేద్దాం అని పవన్ కు పిలుపును ఇచ్చారు.