ఇవాళే జనసేన ఆవిర్భావ దినోత్సవం 

ఇవాళే జనసేన ఆవిర్భావ దినోత్సవం 

జనసేన పార్టీ ఐదో ఆవిర్భావ సభ ఇవాళ జరగనుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది. పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌తోపాటు రాష్ట్ర నాయకులు విచ్చేయనున్నారు. ఈ సభలో పార్టీ మ్యానిఫెస్టోతోపాటు జిల్లాలో అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత పవన్‌కల్యాణ్‌ తొలి ఎన్నికల సభ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఐతే.. ప్రత్యర్థులపై విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రజా సమస్యల పరిష్కారం దిశగా జనసేనాని ప్రసంగిస్తారని తెలుస్తోంది. 

గత ఏడాది అక్టోబర్‌లో రాజమహేంద్రవరంలోనే జనసేన కవాతు నిర్వహించారు. భారీ ఎత్తున కార్యకర్తలు తరలిరావడంతో గోదావరి తీరం కిక్కిరిసిపోయింది. ఈ క్రమంలో మళ్లీ అదే నగరంలో సభ నిర్వహించాలని పవన్ నిర్ణయించారు. ఇక.. ఇవాళ్టి సభకు 'యుద్ధ శంఖారావం' నామకరణం చేశారు.