సీట్ల సర్దుబాటులో గందరగోళం వాస‍్తవమే

సీట్ల సర్దుబాటులో గందరగోళం వాస‍్తవమే

జనసేన పార్టీతో సీట్ల సర్దుబాటు విషయంలో గందరగోళం నెలకొన్న విషయం వాస్తవమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి అంగీకరించారు. పొత్తుల్లో భాగంగా తమకు కేటాయించిన సీట్లలో పోటీ పెట్టారన్నారు. విజయవాడ పార్లమెంట్‌ నుంచి పోటీ చేయమని చెప్పిన, జనసేన ఇప్పుడు గన్నవరం అసెంబ్లీ ఇస్తామని అంటోందని ఆయన అన్నారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రకటనలు ఎవరు చేసిన ఖండించాల్సిందేనని సురవరం అన్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సుదీర్ఘ చరిత్ర ఉన్న సీపీఐకి ఝలక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. సీట్ల సర్దుబాటులో భాగంగా సీపీఐకి ఇచ్చిన బెజవాడ లోక్‌సభ సీటును జనసేన లాగేసుకోవడంతో కూటమి నుంచి బయటకు రావాలని సీపీఐ భావిస్తోంది. కాగా విజయవాడ లోక్‌సభ సీటుకు సోమవారం నామినేషన్‌ వేసేందుకు సీపీఐ అభ్యర్థి చలసాని అజయ్‌ కుమార్‌ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో జనసేన తన అభ్యర్థిగా ముత్తంశెట్టి కృష్ణబాబును నిన్నరాత్రి హడావుడిగా ప్రకటించింది. దీంతో కంగుతిన్న సీపీఐ నేతలు అత్యవసరంగా భేటీ అయ్యారు. కూటమి నుంచి బయటకు రావడమా? కొనసాగడమా? అనే దానిపై చర్చించారు.