పరిషత్‌ ఎన్నికల్లో జనసేన గుర్తులు ఇవీ..

పరిషత్‌ ఎన్నికల్లో జనసేన గుర్తులు ఇవీ..

తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన సిద్ధమైంది. మెజారిటీ ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో జనసేన పోటీ చేయబోతోంది. ఈ నేపథ్యంలో జడ్పటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో పార్టీ గుర్తులను జనసేన విడదుల చేసింది. జడ్పీటీసీ అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుపైన, ఎంపీటీసీ అభ్యర్థులు క్రికెట్‌ బ్యాట్‌ గుర్తుపైన పోటీ చేస్తారని జనసేన ప్రకటించింది. ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి గాజుగ్లాసు గుర్తు లేనందున బ్యాట్ గుర్తు కేటాయించినట్టు తెలిసింది.