జనసేన అనూహ్య నిర్ణయం

జనసేన అనూహ్య నిర్ణయం

మంగళగిరి బరిలో నిలవాలని జనసేన నిర్ణయించినట్టు తెలిసింది. పొత్తుల్లో భాగంగా సీపీఐకి మంగళగిరి స్థానాన్ని కేటాయించగా.. ఆ పార్టీ అభ్యర్థిని కూడా ప్రకటించింది. ఐతే.. అనూహ్యంగా జనసేన తరఫున చల్లపల్లి శ్రీనివాస్‌కు బీఫారం ఇచ్చినట్టు తెలిసింది. సీపీఐ తరఫున ముప్పాళ్ల నాగేశ్వరరావు నామినేషన్‌ వేసేందుకు సిద్ధమవుతుండగా.. జనసేన తరఫున చల్లపల్లి శ్రీనివాస్‌ పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. స్థానికంగా ఉన్న పార్టీ కేడర్‌ను కాపాడుకునేందుకు జనసేన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  ఇక.. ఈ స్థానం నుంచి టీడీపీ తరఫున నారా లోకేష్‌,  వైసీపీ తరఫున ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీ చేస్తున్నారు.