'ఆనంద్‌ను ఎన్‌కౌంటర్‌ చేస్తారని భయంగా ఉంది'

'ఆనంద్‌ను ఎన్‌కౌంటర్‌ చేస్తారని భయంగా ఉంది'

సీపీఐ ఎంఎల్ జనశక్తి రాష్ట్ర నేత ఆనంద్‌ అలియాస్‌ బొమ్మని నరసింహను వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలని ఆయన భార్య పద్మ డిమాండ్‌ చేశారు. ఈమేరకు ఇవాళ ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. 
'ఆనంద్‌ను కరీంనగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనకు ప్రాణహాని తలపెట్టొద్దు. ఆయణ్ను వెంటనే కోర్టులో హాజరుపరచాలి. ఆనంద్ పై ఏమైనా కేసులుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. ఆనంద్‌ను పోలీసులే అరెస్టు చేశారు.. కానీ ఏమీ తెలియనట్టు పోలీసులే మా ఇంటిపై దాడి చేసి నన్ను, నా పిల్లలను భయబ్రాంతులకు గురిచేశారు. ఆనంద్‌ను ఎన్‌కౌంటర్‌లో హత్య చేస్తారని అనుమానంగా ఉంది. ఆయనకు ఏమైనా జరిగిదే ప్రభుత్వమే బాధ్యత వహించాలి' అని పద్మ కోరారు.