ఎన్టీఆర్, చరణ్ సినిమాలో ఆమె కూడ ఉందా ?

ఎన్టీఆర్, చరణ్ సినిమాలో ఆమె కూడ ఉందా ?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో చేయనున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే.  'బాహుబలి' తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో దీనికి సంబందించిన ప్రతి అంశంపై ప్రేక్షకుల్లో అమితాసక్తి నెలకొని ఉంది. 

ముఖ్యంగా చరణ్, ఎన్టీఆర్ ల సరసన హీరోయిన్లుగా ఎవరు నటిస్తారనే అంశంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తుండగా తాజాగా శ్రీదేవి కుమార్తె జాన్హవి కపూర్ ను ఈ సినిమాలోకి తీసుకోవాలని రాజమౌళి గట్టిగా అనుకుంటున్నట్టు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.   మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తేలాలంటే జక్కన్న నోరు తెరిచే వరకు ఆగాల్సిందే.