జాన్వీ కపూర్ అందాల ఆరబోత...!

జాన్వీ కపూర్ అందాల ఆరబోత...!

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఎప్పుడూ అందాల ఆరబోతకు అడ్డు చెప్పలేదు. అది సినిమాల్లో అయినా... నిజ జీవితంలోనైనా! ఆ మాటకొస్తే... సోషల్ మీడియాలోనూ జాన్వీ కపూర్ పోస్ట్ చేసే గ్లామర్ స్టిల్స్ చూసే కుర్రకారుకి కంటిమీద కనుకు లేకుండా పోతుంది. ఇటీవలే యు.ఎస్.లో ఉన్న చెల్లి ఖుషీ దగ్గరకు వెళ్ళి వచ్చిన జాన్వీ కపూర్ పనిలో పనిగా మాల్దీవ్స్ కు వెళ్ళింది. నిజానికి ఇటీవల బాలీవుడ్ సెలబ్రిటీస్ కు ఇది హాలిడే స్పాట్ గా మారిపోయింది. తన స్నేహితులతో కలిసి మాల్దీవ్స్ లో జల్సా చేసిన జాన్వీ కపూర్... ఇవాళ ఉదయం ఒకసారి సరదాగా సాయంత్రం మరోసారి అక్కడ దిగిన గ్లామర్ స్టిల్స్ ను పోస్ట్ చేసింది. రంగల బుడగలు అనే కాప్షన్ తో జాన్వీ కపూర్ పోస్ట్ చేసిన ఆ ఫోటోలను చూసే... జాన్వీనే ఆ రంగుల ఇంద్రధనస్సు అనేది అర్థమైపోతుంది. గత యేడాది కరోనా కారణంగా జాన్వీ నటించిన 'గుంజన్ సక్సేనా' నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యింది. ఇక నూరు శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇచ్చిన తర్వాత ఆమె నటించిన 'రూహీ' థియేట్రికల్ లో రిలీజ్ అయ్యింది. అయితే... ఈ హారర్ మూవీ ఆశించిన స్థాయిలో మాత్రం ఆడలేదు. ప్రస్తుతం జాన్వీ 'దోస్తానా -2', 'గుడ్ లక్ జెర్రీ', 'తక్త్' చిత్రాలలో నటిస్తోంది.