జాన్వీకి అదిరిపోయే జాక్ పాట్

జాన్వీకి అదిరిపోయే జాక్ పాట్

శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ధఢక్ సినిమా ట్రైలర్ ఇటీవలే రిలీజయింది.  ఈ సినిమా ట్రైలర్ అద్భుతః అనిపించే విధంగా ఉంది.  కొన్ని సన్నివేశాల్లో జాన్వీ అచ్చంగా శ్రీదేవిలా ఉందని టాక్ వచ్చింది.  అతిలోక సుందరి ముద్దుల కూతురుకి ఆ ఒక్క కాంప్లిమెంట్ చాలు.. మరో సినిమాలో అవకాశం రావడానికి.  మరాఠీలో అంచనాలకు మించి సంచలనాలు సృష్టించిన సైరత్ మూవీకి ధఢక్ రీమేక్ కావడంతో.. ప్రాజెక్ట్ సేఫ్ గానే ఉంటుంది.  పైగా కరణ్ జోహార్ ప్రొడక్షన్స్ నుంచి వస్తుంది కాబట్టి ప్రొడక్షన్ వ్యాల్యులు రిచ్ గానే ఉంటాయి.  

ధఢక్ విడుదల కాకముందే జాన్వీ కపూర్ కు అదిరిపోయే అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది.  జాన్వికపూర్ ఇటీవలే సంజయ్ లీలా బన్సాలి ఆఫీస్ కు వెళ్ళింది.  దీంతో ముంబై లో కొన్ని వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.  జాన్వీ నెక్స్ట్ ప్రాజెక్ట్ సంజయ్ లీలా బన్సాలితో ఉంటుందని వార్తలు వస్తున్నాయి.  సంజయ్ లీలా బన్సాలి సినిమాలో అవకాశం అంటే.. నటీనటులకు మంచి బ్రేక్ వచ్చినట్టే.  సంజయ్ తీసిన పద్మావతి సినిమా ఎలాంటి సంచనాలు సృష్టించిందో ప్రత్యేకించి చెప్పక్కరలేదు.  ఇప్పుడు శ్రీదేవి ముద్దుల కూతురితో సినిమా చేయబోతున్నట్టుగా వస్తున్న వార్తలు నిజమైతే.. జాన్వీ లక్కీ ఛాన్స్ కొట్టేసినట్టే.