ఇవాళ్టి నుంచే 'జన్మభూమి - మా ఊరు'

ఇవాళ్టి నుంచే 'జన్మభూమి - మా ఊరు'

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'జన్మభూమి-మాఊరు' కార్యక్రమం ఆరో విడత ఇవాళ ప్రారంభంకానుంది. ఈనెల 11వ తేదీ వరకు జరిగే ఈ విడతలో నాలుగేళ్ల  ప్రగతిని, భవిష్యత్‌ లక్ష్యాలను ప్రజలకు వివరించనున్నారు నేతలు. సొంత నియోజకవర్గం కుప్పం నుంచి జన్మభూమికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్లొంటారు. 2019-24 భవిష్యత్‌ ప్రణాళికలపై చర్చించి చివరి రోజు ఒక తీర్మానాన్ని ఆమోదించేలా షెడ్యూల్‌ ఖరారు చేశారు. ఇక.. ప్రభుత్వం విడుదల చేసిన 10 శ్వేత పత్రాలపై ప్రజలకు నేతలు క్లుప్తంగా వివరిస్తారు. ఇక.. జన్మభూమి కార్యక్రమం పర్యవేక్షణకు ప్రతి రెవెన్యూ డివిజన్‌కు ఒక నోడల్‌ అధికారిని ప్రభుత్వం నియమించింది.