రాశి ఫలాలు: 21 జనవరి 2019 సోమ‌వారం

రాశి ఫలాలు: 21 జనవరి 2019 సోమ‌వారం

మేషం: 
పనులలోఅడ్డంకులు ఎదుర్కొంటారు. మానసిక స్థెర్యాన్ని కోల్పోకుండా ఎక్కువసార్లు ప్రయత్నిస్తే విజయం వరిస్తుంది. ఆరోగ్యవిషయంలో సామాన్యంగా ఉంటుంది. ఆర్థికంగా అనుకూలంగా  ఉంటుంది. రావలసిన డబ్బు చేతికందుతుంది. ప్రయాణ సూచన ఉంది. 
వృషభం: 
రోజంతా అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ట్రాన్స్ఫర్ కొరకు ఎదురుచూస్తున్నవారికి ముఖ్యసమాచారం అందుతుంది. మిత్రులను  లేదా బంధువులను కలుస్తారు.
మిథునం: 
ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన ప్రయాణాలు మధ్యలో ఆపవలసి రావటం కానీ, ఏదైనా అడ్డంకి ఎదురవటం కానీ జరుగవచ్చు. ఇతరులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త. అనవసర  వివాదాలు ఏర్పడవచ్చు. కాబట్టి ఆచితూచి వ్యవహరించండి.
కర్కాటకం: 
మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆందోళనలు తగ్గుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల కొరకు డబ్బు ఖర్చు చేస్తారు. పెట్టుబడులకు సామాన్య దినం. దూర  ప్రయాణ సూచన ఉంది. 
సింహం: 
బద్ధకానికి, అసూయకు చోటివ్వకండి. మీ ప్రవర్తన కారణంగా సమస్యలు వచ్చే అవకాశముంటుంది. మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్త. అలాగే ఆరోగ్య  విషయంలో కూడా.
కన్య: 
ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు నెరవేర్చుకోగలుగుతారు. ఆరోగ్యం బాగుంటుంది, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో అనుకున్న  ఫలితం సాధిస్తారు. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.
తుల: 
కొత్త పని ప్రారంభించదానికి అనుకూల కాలం. ప్రారంభం చేసే పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రగతి సాధిస్తారు. ఆటంకాలు తొలగిపోతాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా  కొంత సామాన్యంగా ఉంటుంది.
వృశ్చికం: 
ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. మీ శత్రువుల కారణంగా ఆర్థికంగా నష్టపోయే అవకాశముంటుంది. పెట్టుబడులకు అనువైన రోజు కాదు. ప్రయాణాల్లో  కొంత జాగ్రత్త.
ధనుస్సు: 
ఆరోగ్య విషయంలో జాగ్రత్త. కొత్త పనులకు అనుకూలమైన రోజు కాదు. పెట్టుబడులకు అనువైన రోజు కాదు. ప్రయాణాల్లో కొంత జాగ్రత్త. 
మకరం: 
మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబ సమస్యలు తగ్గుతాయి. రోజంతా ఆనందంగా ఉంటారు. కొత్త పనులు చేపట్టడానికి అనుకూల సమయం. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఆర్థిక  సమస్యలు తొలగిపోతాయి.
కుంభం: 
ఆరోగ్యం బాగుంటుంది. వినోద కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వాహన సౌఖ్యం ఉంది. మిత్రులను కలుస్తారు. ఆర్థిక సంబంధ  లావాదేవీలు మిశ్రమ ఫలితాన్ని ఇస్తాయి.
మీనం: 
ఆరోగ్య విషయంలో కొంత సామాన్యంగా ఉంటుంది. మీ జీవితభాగస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు. ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. డబ్బు ఖర్చవుతుంది. పరీక్షలు రాసే  వారికి అనుకూలంగా ఉంటుంది.