కొలంబియాపై జపాన్‌ విజయం

కొలంబియాపై జపాన్‌ విజయం

ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్‌-2018లో జపాన్‌ విజయం సాధించింది. మోర్దోవియా అరేనా వేదికగా గ్రూపు-హెచ్‌లో కొలంబియా, జపాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో జపాన్‌ 2-1తో గెలిచి ప్రపంచకప్‌లో శుభారంభం చేసింది. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన కొలంబియా జట్టుకు హూహించని షాక్ ఇస్తూ అద్భుత విజయంను సొంతం చేసుకుంది జపాన్ జట్టు. జపాన్ తొలి అర్ధ భాగంలో వచ్చిన పెనాల్టీ అవకాశాన్ని ఉపయోగించుకుంది. 6వ నిమిషంలో జపాన్‌ మిడ్‌ఫీల్డర్‌ షింజి కగవా పెనాల్టీని గోల్‌గా మలిచి 1-0 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. అనంతరం ఇరు జట్లు పోటాపోటీగా ఆడుతూ బంతిని నియంత్రణలో ఉంచుకునేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలోనే 39వ  నిమిషంలో కొలంబియా మిడ్‌ఫీల్డర్‌ క్విన్‌ట్రో నేరుగా ఫ్రీకిక్‌ను గోల్‌గా మలిచి స్కోరును 1-1తో సమం చేశాడు.

ఇక రెండో భాగంలో కూడా మ్యాచ్‌ పోటాపోటీగానే సాగింది. 73వ నిమిషంలో జపాన్‌ ఫార్వర్డ్‌ర్‌ ఒసాకో హెడర్‌ గోల్‌తో జపాన్‌ను మళ్ళీ 2-1తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. దీంతో కొలంబియాపై ఒత్తిడి పెరిగింది. దీంతో మ్యాచ్ పై పట్టు సాదించేందుకు కొలంబియా పోరాడినా.. కనీసం స్కోరును కూడా సమం చేయలేకపోయింది. ఇక మ్యాచ్‌ సమయం కూడా ముగియడంతో జపాన్‌ తొలిసారిగా కొలంబియాపై జట్టుపై 2-1తో జయకేతనం ఎగురవేసింది.

Photo: FileShot