భార్య కోసం సముద్రగర్భంలో వెతుకుతున్న పెద్దాయన... ఎందుకంటే... 

భార్య కోసం సముద్రగర్భంలో వెతుకుతున్న పెద్దాయన... ఎందుకంటే... 

ఆమె ఏమైందో ఎవరికీ తెలియదు.  చనిపోయి ఉంటుందని అనుకున్నారు.  ఆమెకు సంబంధించిన కొన్ని దుస్తులు, వస్తువులు దొరికాయి. కానీ, ఆమె భర్త మాత్రం దానిని నమ్మడం లేదు.  ఎప్పటికైనా భార్య కనిపిస్తుందని నమ్ముతున్నాడు.  ఆ నమ్మకంతోనే గత పదేళ్లుగా వెతుకుతున్నాడు.  సముద్రతీరాన్ని జల్లెడపట్టాడు.  వారంలో ఆరు రోజులు సముద్రతీరాన్ని జల్లెడ పడుతూ, ఏడో రోజున సముద్రంలోకి వెళ్లి సముద్రగర్భంలో వెతుకుతున్నాడు.  

భార్య అంటే అతనికి ప్రాణం.  2011లో జపాన్ లో వచ్చిన సునామీలో ఆయన భార్య కనిపించకుండా పోయింది.  ఎప్పటిలాగే సునామి వచ్చిన రోజున యేసువో భార్య బ్యాంకు కు వెళ్ళింది.  తనకు ఇంటికి రావాలని ఉందని చెప్పి మెసేజ్ చేసింది.  ఆ తరువాత ఏమైందో తెలియలేదు.  యుకుషిమా నగరంలో వచ్చిన సునామీకి అనేకమంది ప్రాణాలు కోల్పోయారు.  బ్యాంక్ కు దగ్గరలో ఓ కొండ ఉన్నది.  అక్కడికి వెళ్లి ఉంటారని భావించిన పెద్దాయన ఆ ప్రాంతాన్ని గాలించాడు.  లాభం లేకుండా పోయింది.  సునామీ తరువాత అక్కడ ఒక బ్యాంక్ ఉన్నట్టుగా కూడా ఆనవాలు కనిపించలేదు.  భార్య లేదనే విషయాన్ని ఆ పెద్దాయన అస్సలు నమ్మడం లేదు.  ఎప్పటికైనా తిరిగి వస్తుందని నమ్ముతున్నాడు.  దేహంలో జీవం ఉన్నంతవరకు వెతుకుతూనే ఉంటానని చెప్తున్నాడు పెద్దాయన.