అలవాట్లో పోరపాటు... షేక్ హ్యాండ్స్ చేసుకోబోయిన కెప్టెన్లు

అలవాట్లో పోరపాటు... షేక్ హ్యాండ్స్ చేసుకోబోయిన కెప్టెన్లు

కరోనా కారణంగా 117 రోజుల తరువాత సౌతాంప్టన్లో అంతర్జాతీయ క్రికెట్ తిరిగి ప్రారంభమైంది. ఇంగ్లాండ్ మరియు వెస్టిండీస్ మధ్య ఈ రోజు మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. అందులో  భాగంగా మ్యాచ్ ముందు టాస్ వేసే సమయంలో అలవాట్లో పోరపాటులాగా షేక్ హ్యాండ్స్ చేసుకోబోయారు కెప్టెన్లు జాసన్ హోల్డర్, బెన్ స్టోక్స్. కానీ తర్వాత మళ్ళీ కరోనా గుర్తుకు వచ్చి ఆగిపోయారు. అయితే టాస్ లో గెలిచిన ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ముందు బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక ఇంతక ముందు చెప్పిన విధంగానే కరేబియన్ జట్టు ఆటగాళ్లు మైదానం లోకి ప్రవేశించిన వెంటనే బ్లాక్ లైవ్స్ మేటర్‌కు మద్దతుగా ఆటగాళ్ళు అందరూ మోకాలి మీద కూర్చొని పిడికిలిని పైకి లేపారు. ఇక మొదట బ్యాటింగ్ కు దిగ్గిన ఇంగ్లాండ్ జట్టు రెండవ ఓవర్లోనే ఓ వికెట్ కోల్పోయింది.