పాకిస్థాన్ లీగ్ కంటే ఇండియన్ లీగ్  ఎంతో ఉత్తమం : జాసన్ రాయ్

పాకిస్థాన్ లీగ్ కంటే ఇండియన్ లీగ్  ఎంతో ఉత్తమం : జాసన్ రాయ్

ఇంగ్లాండ్ క్రికెటర్ జాసన్ రాయ్ పాకిస్తాన్ సూపర్ లీగ్ (పిఎస్ఎల్) లో జాలాహోర్ ఖాలందర్స్ మరియు క్వెట్టా గ్లాడియేటర్లకు ప్రాతినిధ్యం వహించగా, బిగ్ బాష్ లీగ్ (బిబిఎల్) లో స్వాష్ బక్లింగ్ ఆల్ రౌండర్ సిడ్నీ సిక్సర్స్ మరియు సిడ్నీ థండర్స్ తరఫున ఆడాడు అలాగే మన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)  లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు, కానీ ప్రపంచవ్యాప్తంగా అతని అభిమాన టీ 20 లీగ్ గా మన ఐపీఎల్ ను ఎన్నుకున్నాడు. తన 8-మ్యాచ్ల ఐపీఎల్ కెరియర్ లో, జాసన్ రాయ్ 33.58 స్ట్రైక్ రేట్ 29 సగటుతో 179 పరుగులు సాధించాడు. రాయ్  మాట్లాడుతూ... నేను చాల దేశాలలో జరిగే క్రికెట్ లీగ్ లో పాల్గొన్నాను. అయితే వాటన్నిటితో పోల్చితే ఐపీఎల్ ఉత్తమమైనది. ఎందుకంటే.. నేను  పిఎస్ఎల్ లో ఒక ఏడాది ఆడాను. అక్కడి లీగ్ లో కంటే ఐపీఎల్ లో ఎక్కువగా నేర్చుకోవచ్చు" అని తెలిపాడు.  అయితే ఐపీఎల్ ప్రపంచంలోని అత్యంత ధనిక టీ 20 లీగ్, అలాగే అన్ని దేశాల నుండి అత్యంత ఎలైట్ ఆటగాళ్లను ఆకర్షిస్తుంది. కెవిన్ పీటర్సన్, సనత్ జయసూర్య, కుమార్ సంగక్కర, బ్రెట్ లీ, రికీ పాంటింగ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఇలా ఎంతో మంది తమ కెరీర్‌లో ఏదో ఒక సమయంలో ఐపీఎల్ లో భాగమయ్యారు, దేశీయ భారతీయ ఆటగాళ్ళు మాత్రమే కాకుండా వివిధ దేశాల అంతర్జాతీయ క్రీడాకారులు కూడా లీగ్ నుండి చాలా నేర్చుకుంటారు అనడంలో సందేహం లేదు.