వీడియో: 'క్యా' క్యాచ్ హై

వీడియో: 'క్యా' క్యాచ్ హై

టీ20 క్రికెట్ వచ్చినప్పటినుండి క్రికెట్ లో అద్భుతాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆటగాళ్లు ఫీల్డింగ్ లో కొన్ని అద్భుత క్యాచ్ లను అందుకుంటున్నారు. తాజాగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో ఇంగ్లాండ్ ఓపెనర్ జేసన్ రాయ్ కూడా  ఓ అద్బుత క్యాచ్ ను పట్టాడు. బీపీఎల్ లో భాగంగా సిల్హేట్ సిక్సర్స్, చిట్టిగాంగ్ వికింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. చిట్టిగాంగ్ వికింగ్స్ జట్టు ఆటగాడు యాసిర్ అలీ బ్యాటింగ్ చేస్తున్నాడు. సిక్సర్స్ బౌలర్ అలోక్ కపిల్ షార్ట్ పిచ్ బంతి (7.3  ఓవర్) వేయగా.. యాసిర్ అలీ బలంగా లెగ్ సైడ్ బాదాడు. బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న జేసన్ రాయ్ పరుగెత్తుకుంటూ వచ్చి అమాంతం గాల్లోకి లేచి ఒంటిచేత్తో బంతిని అందుకున్నాడు. దీంతో యాసిర్ అలీ (27) నిరాశగా పెవిలియన్ చేరాడు. సిక్సర్స్ చివరకు 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. 'క్యాచ్ ఆఫ్ ది ఇయర్', 'క్యా' క్యాచ్ హై అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.