ఐపీఎల్: ప్రాక్టీస్‌లో పాల్గొన్న బుమ్రా
టీమిండియా ప్రధాన పేసర్, ముంబయి ఇండియన్స్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా మంగళవారం రాత్రి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నాడు. జట్టు సభ్యులతో కలిసి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నా.. బౌలింగ్ ప్రాక్టీస్ మాత్రం చేయలేదు. అయితే కొద్దీ సమయం సహచర ఆటగాళ్లతో కలిసి రన్నింగ్ చేసి.. క్యాచ్ లను ప్రాక్టీస్ చేసాడు. అనంతరం జహీర్‌ఖాన్, విరాట్ కోహ్లీలతో కాసేపు ముచ్చటించాడు. బౌలింగ్ ప్రాక్టీస్ చేయకపోవడంతో.. గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్‌లో బుమ్రా బరిలోకి దిగుతాడో లేదో చూడాలి. బుమ్రా ప్రాక్టీస్‌కి సంబందించిన వీడియోను ముంబై తన అధికారిక ట్విటర్లో పోస్ట్ చేసింది.
ఆదివారం డిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ చివరి బంతికి బుమ్రా గాయపడ్డాడు. డిల్లీ ఆటగాడు రిషభ్ పంత్ కొట్టిన షాట్‌ను ఆపబోతుండగా.. బుమ్రా కింద పడ్డాడు. ఎడమ భుజంకి బలంగా గాయం కావడంతో నొప్పితో విలవిలలాడుతూ మైదానంలోనే పడుకున్నాడు. అనంతరం ఫిజియో వచ్చి చికిత్స చేసాడు. పెవిలియన్‌కు వెళ్లిన బుమ్రా .. ముంబయి ఇన్నింగ్స్‌లో తొమ్మిదో వికెట్ పడ్డా కూడా బ్యాటింగ్‌కు రాలేదు. దీంతో అతడి గాయంపై అందరికి అనుమానాలు నెలకొన్నాయి. అయితే బుమ్రా కోలుకున్నాడని, అతడికి పెద్ద గాయం కాలేదని ముంబయి ఇండియన్స్ యాజమాన్యం, బీసీసీఐ ప్రకటించాయి.
గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబయి ఇండియన్స్ మ్యాచ్ ఆడాల్సిఉంది. దీంతో సోమవారమే ముంబై జట్టు బెంగళూరు చేరుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టింది. బుమ్రా స్కానింగ్ రిపోర్ట్ ఆలస్యంగా రావడంతో.. అతను మంగళవారం బెంగళూరు చేరుకుని జట్టు సభ్యులతో కలిసి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు.
???? Watch: @Jaspritbumrah93 and @iamanmolpreet28 during a fielding drill at the Chinnaswamy.#CricketMeriJaan #MumbaiIndians #OneFamily #RCBvMI pic.twitter.com/Ps4QcKTovD
— Mumbai Indians (@mipaltan) March 26, 2019
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)