టీ-20 సిరీస్ నుండి బుమ్రా అవుట్

టీ-20 సిరీస్ నుండి బుమ్రా అవుట్

ఐర్లాండ్ తో జరిగిన టీ-20 సిరీస్ గెలుచుకుని ఇంగ్లాండ్ పర్యటనకు సిద్దమయిన భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఇంగ్లాండ్ తో జరగబోయే టీ-20, వన్డే సిరీస్‌కి దూరమయ్యాడు. ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ-20లో మ్యాచ్ లో బుమ్రా వేలికి గాయమైంది. ఈ గాయం కారణంగా బుమ్రా రెండో టీ-20 మ్యాచ్ ఆడలేదు. బుమ్రా వేలి గాయం తగ్గకపోవడంతో ఇంగ్లండ్‌తో జరగబోయే రెండు సిరీస్‌ల నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో దీపక్ చాహర్ లేదా షార్దూల్ ఠాకూర్ జట్టుకి వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు 1న మొదలయ్యే టెస్ట్ సిరీస్ కల్లా బుమ్రా కోలుకుంటాడని సమాచారం. జులై 3 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్ ప్రారంభమవనుంది.