బుమ్రాకి చేరువలో రషీద్ ఖాన్
బుధవారం ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 775 పాయింట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 755 పాయింట్లతో రెండవ స్థానంలో ఉన్నాడు. దీంతో బుమ్రాకి దగ్గరగా వచ్చేసాడు రషీద్ ఖాన్. యూఏఈ వేదికగా ఈ నెల 15 నుంచి ఆసియా కప్ ప్రారంభమవుతుంది. ఈ ఇద్దరు ఫామ్ లో ఉన్న నేపథ్యంలో వికెట్లను తీసే అవకాశం ఉంది. ఐపీఎల్-11లో అద్భుతంగా రాణించిన రషీద్ ఖాన్.. అదే జోరుని ఆసియా కప్‌లోనూ కొనసాగించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇదే జరిగితే జస్ప్రీత్ బుమ్రా మొదటి స్థానానికి ప్రమాదం పొంచి ఉంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)