భారత్ కు షాక్... నాలుగో టెస్టుకు బుమ్రా దూరం

భారత్ కు షాక్... నాలుగో టెస్టుకు బుమ్రా దూరం

భారత్-ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం నాలుగు టెస్టుల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మార్చి 4న చివరి టెస్ట్ ప్రారంభం అవుతుంది. అయితే ఈ టెస్టుకు ముందు టీం ఇండియాకు షాక్ తగిలింది. భారత స్టార్ పేసర్ బుమ్రా నాలుగో టెస్టులో ఆడటం లేదు బీసీసీఐ తాజాగా ప్రకటించింది. వ్యక్తిగత కారణాల వల్ల తనను నాలుగో టెస్ట్ జట్టు నుండి తప్పించాలని బుమ్రా కొరినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఇక ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన మూడు టెస్టులలో భారత్ 2-1 తో ఆధిక్యంలో ఉంది. అయితే భారత్ ఈ టెస్ట్ సిరీస్ ను సొంతం చేసుకోవాలన్న.. అలాగే జూన్ లో జరిగే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో బెర్త్ ఖాయం చేసుకోవాలన్న ఈ చివరి టెస్టులో విజయం అయిన దక్కించుకోవాలి.. లేదా డ్రా అయిన చేసుకోవాలి. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.