‘జాతిరత్నాలు’ ట్రైలర్ విడుదల చేయనున్న ప్రభాస్‌

‘జాతిరత్నాలు’ ట్రైలర్ విడుదల చేయనున్న ప్రభాస్‌

'ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్‌ నవీన్‌ పోలిశెట్టి హీరోగా అనుదీప్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాతిరత్నాలు’. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. స్వప్న సినిమాస్‌ పతాకంపై నాగ్‌ అశ్విన్‌ నిర్మించిన ఈ చిత్రం మార్చి 11న విడుదలవుతోంది. ప్రస్తుతం ఈ చిత్రబృందం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజాగా ‘జాతిరత్నాలు’ ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు. మార్చి 4 సాయంత్రం 4:20 నిమిషాలకు ఈ ట్రైలర్‌ విడుదల చేయబోతోన్నట్లుగా చిత్రయూనిట్‌ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విడుదల చేయనున్నారు. ఇప్పటికే టైటిల్, పోస్టర్స్, టీజర్ లతో ఆకట్టుకున్న జాతిరత్నాలు.. ప్రభాస్ విడుదల చేయబోయే ట్రైలర్ తో మరోసారి నవ్వించడానికి రాబోతున్నారు.