జాతిరత్నాలు టీజర్ రిలీజ్..

జాతిరత్నాలు టీజర్ రిలీజ్..

తెలుగు సినీ పరిశ్రమలో యంగ్ హీరోగా ఎదుగుతున్న నటుడు నవీన్ పోలిసెట్టి. షార్ట్ ఫిల్మ్‌స్, యూట్యూబ్ వీడియోలతో తన టాలెంట్‌ చూపించుకున్నాడు. తెలుగులో సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాలో హీరోగా అరంగేట్రం చేశాడు. తన తొలిసినిమాతోనే అందరికి తన ప్రతిభను కనబరిచాడు. ప్రతస్తుతం నవీన్ మరో సినిమా చేశాడు. దాని పేరు ‘జాతిరత్నాలు’. మొదటి సినిమాలో తప్పు చేసిన వారిని పట్టించే డిటెక్టివ్‌గా కనిపించిన నవీన్ ఈ సినిమాలో తానే ఓ దొంగగా కనిపించాడు. ఈ సినిమాలో జోగిపేట శ్రీకాంత్ అనే పాత్రలో నవీన్ కనిపించనున్నాడు. అయితే నవీన్ నేడు తన 31వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఈ సినిమా మేకర్స్ జాతిరాత్నాలు టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ 25సెకండ్ల నిడివితో అందరిని ఆకట్టుకుంది. ఇందులో ‘మీ ఖాకీ బట్టలు, తుపాకీ గుళ్లు మా నోళ్లు నొక్కలేవు ఇన్సెక్టర్’అంటూ నవీన్ కనిపించాడు. దాంతో ఈ సినిమాపై ఉన్న ఆసక్తి మరింతగా పెరిగింది. మరి అభిమానులు ఆసించిన విధంగా సినిమా ఉంటుందో లేదో వేచి చూడాలి.