భవిష్యత్తులో లాలాజలం కంటే చెమట ఎక్కువ పాత్ర పోషిస్తుంది : భారత మాజీ పేసర్

భవిష్యత్తులో లాలాజలం కంటే చెమట ఎక్కువ పాత్ర పోషిస్తుంది : భారత మాజీ పేసర్

కరోనా కారణంగా క్రికెట్ లో లాలాజలం నిషేధంపై క్రికెట్ లోని పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ, భారత మాజీ పేసర్ జవగల్ శ్రీనాథ్ మాట్లాడుతూ లాలాజలానికి చెమట మంచి ప్రత్యామ్నాయం అవుతుందని తెలిపాడు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆటలు తిరిగి ప్రారంభమైన తర్వాత అనిల్ కుంబ్లే నేతృత్వంలోని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) క్రికెట్ కమిటీ లాలాజల నిషేధాన్ని సిఫారసు చేసింది. అయితే బౌలింగ్ చేసే సమయం లో చెమటను ఉపయోగించడం గురించి ఆరోగ్య సమస్య లేదని ఐసీసీ తెలిపింది.

13 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్‌లో 551 అంతర్జాతీయ వికెట్లు సాధించిన జవగల్ శ్రీనాథ్ మాట్లాడుతూ, లాలాజలానికి చెమట మంచి ప్రత్యామ్నాయం అని నేను అనుకుంటున్నాను. ఏందుకంటె బౌలర్లు లాలాజలం కంటే ఎక్కువ చెమటను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అందువల్ల క్రీడలు తిరిగి ప్రారంభమైనప్పుడు చాలా తేడా కనిపించదని శ్రీనాథ్ అన్నారు.