'పాక్‌తో మ్యాచ్‌ను వ‌దులుకున్నా న‌ష్టం లేదు'

'పాక్‌తో మ్యాచ్‌ను వ‌దులుకున్నా న‌ష్టం లేదు'

టీమిండియా ప్రతిష్టాత్మక వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2109 లీగ్ దశలో పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌ను వ‌దులుకున్నా న‌ష్టం లేదని భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అభిప్రాయపడ్డారు. తాజాగా గౌతం గంభీర్ మాట్లాడుతూ...  వచ్చే వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో పాకిస్థాన్‌తో టీమిండియా ఆడాలా వ‌ద్దా అన్న అంశంపై బీసీసీఐ నిర్ణ‌యం తీసుకుంటుంద‌న్నారు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను వ‌దులుకున్నా పెద్దగా న‌ష్టం లేదు. రెండు పాయింట్లు అంత ముఖ్యం కాదు.. క్రికెట్ క‌న్నా జ‌వాన్లే ముఖ్యం. అన్నిటికంటే దేశ‌మే ముందు అని గౌతం గంభీర్ చెప్పుకొచ్చారు.